సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల రేటు అకస్మాత్తుగా పడిపోయింది . జిల్లాలోని కీలకమైన ఆకివీడు మార్కెట్ లో చేపలు ధరలు దారుణంగా పడిపొయాయి. మొన్నటి వరకూ కిలో 130 -150 రూపాయలు వరకూ పలికిన చేప ధర ఇప్పుడు 10 నుండి 20 రూపాయలుకు కూడా కొనే వారులేక లబో దిబో మంటున్నారు ఆక్వా రైతులు. ఒక ప్రక్క మేఘాలు, మరో ప్రక్క అకస్మాత్తు గ తీవ్ర ఎండ , మరోప్రక్క తీవ్ర ఉక్కబోత విచిత్ర వాతావరణం మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్ పడిపోవడంతో చేపలు చనిపోయి కుప్పలుగా తేలిపోతున్నాయి. భీమవరం మొదలుకొని గణపవరం, ఆకివీడు, కలిదిండి ,ముదినేపల్లి వరకు ఇదే తీరు . దానితో రైతులు ఆందోళనతో వెంటనే అప్రమత్తమైన రైతులు చేపలను పట్టి అందరు ఒక్కసారిగా మార్కెట్ కు తరలిస్తున్నారు. ఒక్కసారి మార్కెట్ కు భారీ స్థాయిలో చేపలు రావడంతో కొనేవారు లేక రేటు దారుణంగా పడిపోయింది.చేపలతో బొచ్చె , శీలావతి, పండుగప్ప, కోరమీను గడ్డి చేప లాంటి రకాలు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి.ఇటీవల వాతావరణ ప్రభావంతోచేపలతో పాటు రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆక్సిజెన్ కోసం చెరువులలో మందులు విద్యుత్తూ మోటరు ఫ్యానులు వాడవలసి అదనపు ఖర్చులు అవుతున్నాయని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు ఆక్వా రైతులు.
