సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించిన ‘రెమాల్ ‘తుఫాన్ తీరాన్ని తాకింది. గత రాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ విభాగం తెలిపింది. దీని కారణంగా బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక రెమాల్ తుఫాన్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలో తుపాను వర్షానికి గాలులకు ఏకంగా ఏడుగురు మృతి చెందారు. తాడూరు శివారులో రేకుల షెడ్డు కూలి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పిడుగుపాటుకు గురయ్యారు. మరొకరు ఈదురుగాలులకు ఇటుక రాయి కారుపై ఎగిరిపడడంతో అద్దం గుచ్చుకొని చనిపోయారు.. ఇటు కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరా ప్రాంతం పెనుగాలులు వీస్తున్నాయి.చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. నరసాపురం, భీమవరం, కృష్ణ జిల్లా తీరప్రాంతాలలో మత్యకారులు సముద్రలోకి వెళ్లకుండా నిషేధం కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *