సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వాడవాడలా ఎన్టీఆర్ విగ్రహాలకు పుష్పమాలలు వేసి స్థానిక టీడీపీ నేతలు ఆ మహానేతకు ఘన నివాళ్లు అర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎంపీ రఘురామకృష్ణం రాజు నివాళులర్పించారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తాను ఎన్టీఆర్ అభిమానిని అని అన్నారు. 1991లో ఎన్టీఆర్‌ను కలసిన సందర్భం తన జీవితంలో మధురమైన క్షణాలు అని రఘురామ పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాదిరి మానవత్వం ఉన్న నేతలు శతాబ్దంలోనే లేరన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది అతిపెద్ద స్థాయి అని..జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పోషించిన అగ్ర నేత అని ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇచ్చి గౌరవిస్తోందన్న నమ్మకం తనకుందన్నారు. అంబేద్కర్, పూలే మాదిరి.. ఎన్టీఆర్ జయంతిని కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని రఘురామ డిమాండ్ చేసారు. స్వ ర్గీయ ఎన్టీఆర్ వరవడిలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ వచ్చే ఎన్నికలలో విజయం సాధించబోతోందన్నారు. ఏడు రోజుల్లో ఏపీలో టీడీపీ అధికారం చేపట్టబోతోందన్నారు
