సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు బుధవారం ( మే 29న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. దాదాపు బెంచ్‌మార్క్ సూచీలు మొత్తం బుధవారం నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు, బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 515 పాయింట్లు క్షీణించి 74,655 వద్ద ట్రేడైంది. అదే సమయంలో NSE నిఫ్టీ 145 పాయింట్లు పడిపోయి 22,746.30 వద్దకు చేరుకుంది. అదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ 493 పాయింట్లు నష్టపోయి 48, 641కి చేరుకోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 121 పాయింట్లు తగ్గి 52164 స్థాయికి చేరుకుంది. అయితే బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు పలు కారణాల నేపథ్యంలో బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.అయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిండాల్కో, నెస్లే, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్ కంపెనీల షేర్లు టాప్ 5 గెయినర్లుగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *