సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ దాదాపు అన్ని ప్రాంతాలలో 2 రౌండ్లు ఓట్ల కౌంటింగ్ పూర్తీ అయ్యింది.టీడీపీ, జనసేన , బీజేపీ కూటమి అభ్యర్థులు ఆదిక్యతలో దూసుకొని పోతున్నారు. తాజాసమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి 94 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా అధికార వైసీపీ కేవలం 19 స్థానాలలో ఆధిక్యత లో కొనసాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 స్థానాలలో కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. భీమవరం జనసేన అభ్యర్థి అంజిబాబు కన్నా వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ 7,012 ఓట్ల వెనుకబడి ఉన్నారు. ఉండి లో రఘురామా కృష్ణంరాజు 9,689 ఓట్ల ఆధిక్యతలో తన సమీప వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు ఫై కొనసాగుతున్నారు. నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ తమ సమీప వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ఫై 15, 354 మెజారిటీ తో కొనసాగుతున్నారు,
