సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొద్దీ రోజులుగా 88 ఏళ్ళ పెద్దవయస్సు వృధాప్య రీత్యా అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి నేపథ్యంలో ఆయన పార్ధివదేహాన్నిరాజకీయనేతలతో పాటు చిరంజీవి,రజనీకాంత్, పవన్, మోహన్ బాబు,జూనియర్ ఎన్టీఆర్ అశ్వనీదత్ వంటి సినీ ప్రముఖులు అందరు దర్శించుకొని ఘన నివాళ్లు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి రామోజీరావు నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. అదే విధంగా ప్రపంచంలో అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి తెలుగు సినిమాలకు మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని సినిమాల షూటింగ్స్ కి హైదరాబాద్ ను కేంద్ర బిందువు అయ్యేలా చేశారు.బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ సైతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి ఇక రామోజీరావు మృతి నేపథ్యంలో ఆయనకు సంతాపంగా రేపు తెలుగు సినీ పరిశ్రమంలో తెలుగు సినిమాలకు సంబంధించిన అన్ని షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *