సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు బుధవారం ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా విజయవాడ సమీపంలోని గన్నవరంలో ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ లోపు నేడు, మంగళవారం టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును ప్రతిపాదించారు. అనంతరం ఎన్డీయే కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్‌, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు.. గవర్నర్‌కు కూటమి పక్షాల నేతలు లేఖ ఇస్తారు. దానితో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *