సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఏపీలో కొత్త ప్రభుత్వ మంత్రుల ప్రమాణ స్వీకారం వేదికపై అరుదైన అద్భుత దృశ్యం ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత సభా వేదికనుంచి మోదీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు పక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు. ప్రధాని చెవిలో పవన్ ఎదో చెప్పారు. వెనువెంటనే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని.. అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్.. ఉండగా మధ్యలో మోదీ నిల్చుకుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. తదుపరి ఇద్దరు సోదరులను అభినందించారు. ఈ దృశ్యం చూడగానే సభికులంతా మెగస్టార్.. పవర్ స్టార్ నినాదాలు చేశారు. అంతేకాదు మెగస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. తదుపరి చంద్రబాబు కూడా బాలయ్య ను పిలచి మోడీ తో కలసి ఇదే తరహా ఫోటో దిగటం విశేషం.
