సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ లో ఉన్న ప్రముఖ చిట్ పండ్ సంస్థ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఖాతాదారుల నుంచి వసూలు చేసిన రూ.12 లక్షలతో పరారీ అయినట్లు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. ఆ ఉద్యోగి ఖాతాదారులతో కంపెనీ చిట్ లేకుండానే ఉన్నట్లు కొత్త చిట్ పేరుతొ నమ్మించి ప్రతి నెలా వాయిదా సొమ్ము వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం పై ఖాతాదారులకు అనుమానం రావడంతో అతడు వాసులు చేసిన సొమ్ముతో పరారీ అయినట్లు తెలుస్తుంది. ఆ చిట్ సంస్థ ప్రతినిధులు పోలీసులను సంప్రదించారు.
