సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారంఆంధ్రప్రదేశ్‌లోని సచివాలయంలో నేడు, గురువారం నారా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు. 16347 పోస్టులతో డీఎస్సీ కోసం తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ రెండో ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేశారు. సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపుపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదో సంతకం చేశారు.
