సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ నేడు, గురువారం సోషల్ మీడియాలో X పోస్ట్ లో.. రాష్ట్రంలో చంద్రబాబు ఇలా అధికారంలోకి వచ్చారో లేదో.. రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందని రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలుస్థ కుప్పకూలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు కనపడుతున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలర్త పై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని, పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని చెప్పారు. ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్సిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యార్జలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లలోళ్ల పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బ తీసి, కేవలం మూడు రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుందన్నారు జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *