సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గోదావరి జిల్లాలో అడపాదడప వర్షం పడుతున్న ఎండలు మాత్రం దంచి కొట్టడం తీవ్ర ఉక్క తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి..దీనికి తోడు ద్రోణి ఏర్పడటంతో వచ్చే ఐదు రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయి అని ఐఎండీ అంచనా వేసింది.. ఇక వర్షాకాలం ప్రారంభం అయినట్లే ..
