సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఏపీ అసెంబ్లీ లో నూతన సభ్యుల ప్రమాణస్వీకారోత్సవాలలో అందరు ఆసక్తిగా ఎదురు చూసిన పరిణామం జరిగింది. మాజీ సీఎం జగన్ ఈసారి ఎమ్మెల్యే గా అసెంబ్లీలో ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆయనను పేరు పిలిచిన వెంటనే సభలోకి వచ్చారు. నేరుగా పోడియం వద్దకు వెళ్లి ప్రమాణం చేసి సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లోకి వెళ్లి కొద్దిసేపు తన తో పాటు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేరుగా తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు. అసెంబ్లీ లోపలకి వచ్చి ప్రమాణం చేసేందుకు సమయంలో జగన్ పక్కనే పెద్దిరెడ్డి మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రమాణం చేసేందుకు వస్తున్న సమయంలో అందరికీ దండం పెడుతూ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుకు కూడా జగన్ నమస్కరించడంతో ఆయన ప్రతి నమస్కారం చేశారు. ప్రమాణం చేసే సమయంలో తొలుత వైఎస్ జగన్మోహన్ అనే నేను’ అని పలికి ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని పూర్తీ పేరు పలికారు. శకుని పాచికలతో రాజ్యం కోల్పోయిన పాండవులు పరిస్థితి మాది.. ఇక కౌరవ సభను తలపించే అసెంబ్లీ కి దూరంగా ఉంటామని ప్రకటించిన జగన్.. ఇకపై అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనే అవకాశం కనపడటం లేదు.. ఏది ఏమైనా ప్రతి పక్షం లేకపోవడం ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం ఈ సారి అసెంబ్లీ లో ఆ పాత్ర ఎవరు పోషిస్తారో వేచి చూడాలి..
