సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ లో సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా నేడు, శుక్రవారం సభలోకి సీఎం చంద్రబాబు అడుగు పెట్టగానే సభ్యులు లేచి నుంచొని హర్షధ్వానాలు చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు స్వాగతం పలికారు. అంతకు ముందు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి చంద్రబాబు నమస్కారం చేశారు.అనేక మంది ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. అసెంబ్లీ లోపలికి పూర్ణ కుంభంతో చంద్రబాబుకు వేద పండితులు స్వాగతం పలికారు. తన ఛాంబర్ లోకి వచ్చిన వెంటనే.. చంద్రబాబుకు పండితులు ఆశీర్వచనం పలికారు. అసెంబ్లీ లో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి మొదటగా చంద్రబాబు పేరు పిలవగానే వెళ్లి నారా చంద్రబాబు నాయుడు అను నేను.. అంటూ కూటమి సభ్యుల హర్షద్వానాల మధ్య ప్రమాణ స్వీకారం చేసి క్రిందకు వచ్చి సంతకాలు చేసారు. సరిగ్గా 2021 నవంబర్ 19 న చంద్రబాబు తన సతీమణిని కూడా అవమానిస్తున్నారని చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. కౌరవ సభను గౌరవ సభగా చేసి తిరిగి ముఖ్యమంత్రిగా ఈ సభలో అడగు పెడతానని చంద్రబాబు శపథం చేసిన వెళ్లిపోయారు. ఇవాళ మళ్ళీ ఈ రోజు సీఎంగా సభలో చంద్రబాబు అడుగుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *