సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో నేడు, శుక్రవారం భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గా పులపర్తి రామాంజనేయులు ప్రమాణ స్వీకారం చేసారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం చంద్రబాబు వద్ద కు, పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి అభినందనలు అందుకొన్నారు. పులపర్తి అంజిబాబు భీమవరం నుండి 3వ సారి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. మొదటి సారి కాంగ్రెస్ పార్టీ నుండి 2వ సారి టీడీపీ నుండి తాజగా మూడవసారి జనసేన నుండి ప్రాతినిధ్యం వహించడం విశేషంగా చెప్పుకోవాలి. భీమవరం లో ఆయన మద్దతు దారులు, కూటమి సభ్యులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
