సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా తిరిగి గెలిపించుకోవడానికి రాజీనామా చేసిన వేలాది వాలంటీర్లు..తీరా ప్రభుత్వం మారిపోవడంతో ఇక భవిష్యత్తు లేదని మనోవేదనకు గురి అవుతుంటే.. మరో ప్రక్క చంద్రబాబు ప్రభుత్వం డిగ్రీ చదివితేనే వాలంటీర్ గా కొనసాగాలని కొత్త రూల్ పెడుతున్నారన్న సమాచారంతో ఉన్న వాలంటీర్లు భవిషత్తు కూడా ప్రశ్నార్థకమైందంటూ ఆందోళన చెందుతున్నారు. నిజానికి డిగ్రీ చదివిన వారు 5వేలకు 10 వేల జీతానికి ఎందుకు పనిచేస్తారు? ఎదో చిన్నస్థాయి లో చదివిన వారు గౌరవంగా బ్రతకడానికి వాలంటర్ పని ఇన్నాళ్లు ఉపయోగపడింది. కొత్త ప్రభుత్వం పొమ్మనకుండా పొగ బెట్టిందని వాలంటీర్ గా పనిచేసి అచుత్యాహంగా జగన్ కోసం రాజీనామాలు చేసినవారితో పాటు ప్రస్తుతం విధులలో కొనసాగుతున్నవారు కూడా ఇప్పటికే గమనించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 9,200 మంది వలంటీర్లు విధులు నిర్వహించారు. ఎన్నికల కోడ్ సమయంలో 3నెలలు విధులకు దూరం కావడంతో మరి కొందరు జగన్ కు మద్దతుగా జిల్లాలో 5,160 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. మిగిలిన 4,040 మంది విధుల్లో ఉన్నారు. రాజీనామా చేసినవారిలో కొందరు మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ముఖ్యంగా మహిళా వాలంటీర్లు జిల్లాలో ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలను కలిసి తమ గోడు చెప్పుకొంటున్నారు. ఒక రకంగా అన్ని తెలిసి ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. వారి బాధను చూసి ప్రభుత్వ దృష్టికి తీసుకొనివెళతామని కూటమి ఎమ్మెల్యేలు మానవత్వంతో వారికీ చెబుతున్నారు. డిగ్రీ మెలిక కూడా సవరిస్తే మంచిదని దీనిపై ఒకటి 2 రోజులలో చంద్రబాబు ప్రభుత్వం కూడా చర్చిస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రతి వ్యవస్థల్లో కొందరు తప్పులు చేస్తారు.. అయితే కేవలం 5వేలు గౌరవ జీతం తో జీవనోపాధి బ్రతుకుతున్నారంటే వారి స్థితిగతులను అర్ధం చేసుకొని వారి సేవలను కరోనా సమయంలో రాజకీయాలకు అతీతంగా ఎందరికో ఆపద్భాందవులుగా మారిన వాలంటీర్లు ను కక్ష రాజకీయాలకు సమిధలు కాకుండాచూడవలసిన బాధ్యత అందరికి ఉంది... సిగ్మా ప్రసాద్ కాలమ్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *