సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఎదో కారణంతో ఏ రైళ్లు ఎన్ని రోజులు రద్దు అవుతాయో తెలియక పశ్చిమ గోదావరి జిల్లా ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు నేటి సోమవారం నుంచి 45 రోజులపాటు 26 రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో రత్నాచల్, జన్మభూమి , సింహాద్రి , సర్కార్ ఎక్స్‌ప్రెస్ సహా డిమాండ్ ఉన్న రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో విజయవాడ , విశాఖ , తిరుపతి , హైదరాబాద్ వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి. ఆకస్మికంగా రైళ్ల రద్దు చేయడంపై రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు సందిగ్ధత లో ఉన్నారు. కాగా కడియం – నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ ఆధునికరణ కోసం ఆగస్టు 10వ తేదీ వరకు నెలన్నర పాటు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనితో గోదావరి జిల్లాల నుండి ప్రతి రోజు రైలు ప్రయాణం చేసే వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణం ఖర్చులతో పాటు బస్సుల రద్దీ పెరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రాజమండ్రీ వైపు నుండి ఇంటర్ సిటీ రైళ్లు నడపాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కూడా రైల్వే అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయిస్తే ప్రయాణికులు కొంతయినా ప్రయాణ ఇబ్బందులు తగ్గించవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *