సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేవలం 240 సీట్ల బీజేపీ బలంతో మిగతా ఎన్డీయే కూటమి లో పార్టీల ఊతం తో 3వ సారి అధికారంలోని వచ్చిన మోడీ సర్కార్ కు అత్యంత బలమైన కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి తోలి సవాల్ ఈ రోజు విసిరింది. నేడు, ఎన్డీయే కూటమి బలపరచిన లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా ఏకగ్రీవం అవుతారని భావించిన బీజేపీ, భాగస్వామ్య పార్టీలకు విపక్ష కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. అతనికి పోటీగా వారికీ సంఖ్యా బలం తక్కువున్నప్పటికీ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టింది. దక్షిణాదికి చెందిన కేరళ నుంచి 8 సార్లు ఎంపీగా గెలిచిన కొడికున్నిల్ సురేశ్‌ను ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా హస్తం పార్టీ ప్రటించింది. ఆయన నేటి మధ్యాహ్నం 12 గంటల లోపు మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. నిజానికి కాంగ్రెస్ బీజేపీ ని డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి అప్పగించాలన్న సంప్రదాయాన్నిపాటించాలని డిమాండ్ చేసింది. దానికి బీజేపీ మొండిగా ససేమిరా అనడంతో స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలైంది. కాగా దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఇప్పటివరకు జరిగిన లోక్ సభ స్పీకర్ పదవులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. కాగా 75 ఏళ్ల దేశ చరిత్రలో లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండడం ఇదే తొలిసారి కానుంది. నేటి ఉదయం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇండియా కూటమి సభ్యులతో జరిపిన చర్చల్లో.. డిప్యూటీ స్పీకర్‌ పదవిని విపక్షాలకు ఇస్తే స్పీకర్‌‌కి మద్దతు తెలుపుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ ను గెలిపించుకునేందుకు ఎన్డీయే పార్టీల తో పాటు స్వతంత్రులుగా ఉన్న వైసీపీ వంటి పార్టీల ఎంపీల ఓట్లను కూడా అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటములు అభ్యర్ధించవలసిన కీలక సమయం వచ్చింది. మరి వైసీపీ 4గురు లోక్ సభ ఎంపీలు ఎవరికి ఓటు వేస్తారో తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *