సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్దానములో నేడు, మంగళవారం ఉదయం గత 92 రోజులుగా భక్తులు హుండీలలో చెల్లించిన కానుకలు లెక్కించగా మొత్తం ఆదాయం రూ. 69,20,286.00 అక్షరాల అరవై తొమ్మిది లక్షల ఇరవై వేల రెండు వందల ఎనబై ఆరు రూపాయలు వచ్చింది. ఇక భక్తులు హుండీ ద్వారా, బంగారం 154 గ్రాములు, వెండి 590 గ్రాములు సమర్పించారు. మరియు ఈసారి విదేశీ కరెన్సి గణనీయంగా లభించింది బహరైన్ దేశానికీ చెందిన 1 దీనార్ , అమెరికాకి చెందిన 144 డాలర్లు, ఖత్తార్ దేశానికి చెందిన 50 రియాల్స్, ఎమిరేట్స్ దేశానికీ చెందిన 5 దిర్హామ్స్ , ఆస్ట్రేలియా కి చెందిన 5 డాలర్లు, బ్రిటన్ దేశానికి చెందిన 10 పౌండ్లు, యూరప్ దేశానికి చెందిన 10 యూరోలు, కెనడా కి చెందిన 5 డాలర్లు, ఐర్లాండ్ కి చెందిన 10 పౌండ్లు,మలేసియా కి చెందిన 1 రింగిట్టు, ఒమాన్ కి చెందిన 100 బైసాలు, సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు
బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ,, పరివేక్షణదారు తనిఖీదారివారు వి వేంకటేశ్వరరావు, బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది మరియు విజయవాడ కి చెందిన ఉమా మహేశ్వర సేవాసంఘం వారు పాల్గొన్నారని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *