సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, గురువారం స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్ లో వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారి కోసం తపించిన వ్యక్తి ఈ రాష్ట్రం బాగుండాలని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బతకాలని కోరుకునే వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అని ఆయన జయంతిని పురస్కరించుకొని పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక జనసేన టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *