సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరంలోని 23 25 29 39 వార్డులలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్లు డ్రైన్లు ను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ శ్యామల, AE శ్రీనివాస్ ఇతర అధికారులు ఆయనతో ఉన్నారు. భీమవరం మున్సిపాలిటీ పరిధిలోని 23,25,29 వార్డుల్లో సుమారు 2 కోట్ల 50 లక్షలతో నిర్మిస్తున్న సిసి,బిటి రోడ్లు, డ్రైన్లను స్వయంగా పరిశీలించి అధికారులకు కాంట్రాక్టర్లు కు తగిన సూచనలు చేసిన ఎమ్మెల్యే అంజిబాబు మీడియా తో మాట్లాడుతూ.. పట్టణంలో కీలక రోడ్లన్నీ కూడా ఇంతవరకు చరిత్రలో చూడని విధంగా మంచి క్వాలిటీ తో చూసి వెయ్యాలని చెప్పిన మొట్టమొదటి ఎమ్మెల్యే నేను అన్నారు. ఈ కార్య క్రమంలో టీడీపీ నేత కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అడ్జక్షుడు చెనమల్లా చంద్రశేఖర్ తదితర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు
