సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:తెలుగు రాష్ట్రాల సీఎం ల సమావేశానికి హైదరాబాద్ లో రంగం సిద్ధం అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబు నేటి శనివారం సాయంత్రం ప్రజాభవన్‌కు చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లు పుష్ప గుచ్చము అందించి సాదరంగా స్వాగతం పలికారు.వారిరువురికి చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపికలు శాలువాలు అందజేశారు. చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్‌తో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు. అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కీలక సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. (కాసేపట్లో వస్తారని భావిస్తున్నారు.?) ఇక వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో హామీలపై ఈ ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు. వీరి చర్చలు సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో చర్చల సారాంశం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. .
