సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఈ సారి కేంద్రంలోని మోడీ సర్కార్ కు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి బలమైన ప్రతి పక్షంగా మొదటి సారి ఢీ కొడుతోంది. ప్రజా స్వామ్యంలో ఇది మంచి పరిణామమే.. మరి నేడు, శుక్రవారం (ఇండియా కూటమి లోని సభ్యత్వం కలిగిన) బీజేపీ కి దీటుగా ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలలో తమ పార్టీ విజయపతాక ఎగురువేసి దేశ రాజకీయాలలో సంచలనం రేపిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత క్రేజీ వాల్ కు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ కు ఊరట లభించింది. ఆయనకు నేడు, శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆయనకు ధర్మాసనం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తన అరెస్ట్ అక్రమం అని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసినట్టు జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం తిహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *