సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు ప్రభుత్వం ప్రతి కుటుంబంలో ఎంతమంది చదువుకొనే పిల్లలు ఉంటె అందరికి ఒక్కక్కరికి 15వేలు చప్పున ‘తల్లికి వందనం’ అందజేస్తామని నలుగురు పిల్లలు ఉన్న 60 వేలు ఇచ్చేస్తామని చంద్రబాబు లోకేష్, నిమ్మల రామానాయుడు వాయిస్ ప్రజల చెవులలో ఇంకా రి సౌండ్ లో వినిపిస్తుంది. మరి ఈ హామీ నేపథ్యంలో తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పబ్లిక్ లో తీవ్ర చర్చకు దారి తీసింది. పిల్లలని స్కూల్ కి పంపే అమ్మలకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 15,000 ఆర్థిక సహాయం అంటూ జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. జీవో రాగానే టీడీపీ వర్గాలు కూడా మొదట సందడి చేసారు. పిల్లలందరికీ ఒకొక్కరికి 15000 అనుకోని.. అన్నమాట నిలబెట్టుకొన్నామని.. భావించారు. కానీ జీవో జాగ్రత్తగా పరిశీలిస్తే తల్లికి 15వేల చప్పున అని స్వష్టంగా ఉండటంతో.. అందరూ అవాక్కయ్యారు. మరి జీవో లో పొరపాటు జరిగిందో లేక కావాలనే ఆలా చేసారో 24 గంటలు గడుస్తున్నా ప్రభుత్వ పెద్దలు ఇంకా వివరణ ఇవ్వడం లేదు.. మరి ఇలా చేస్తే జగన్ అమ్మవడికి, కూటమి కొత్తపధకానికి తేడా ఏముంది? పేరు మార్పు తప్ప..ఇదే విషయాన్ని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పాత వీడియో క్లిపింగ్స్ జోడించి తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *