సిగ్మాతెలుగుడాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నేడు, బుధవారం తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేసి సంబంధిత విద్యార్థులకు సీట్ల కేటాయింపు సమాచారం అందజేశారు. ఈ మేరకు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకొనేందుకు AP EAPCET హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం.. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు 17-22లోపు చేరాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.చంద్రబాబు ప్రభుత్వ హయంలో ఇంజినీరింగ్ కాలేజీలలో బాగా డిమాండ్ ఉన్నసైన్స్ అండ్ టెకనాలజీ కి సంబంధించి అదనపు సీట్లు కోటా కూడా పెంచడంతో అటు కాలేజీల మేనేజిమెంట్ కోటా పెరగటంతో పాటు మరింత మంది ర్యాంకులు సాధించిన విద్యార్థులకు చదువుకొనే అవకాశం కలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *