సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో నేడు, మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో పట్టణంలో పబ్లిక్ ప్రాంగణములో ధూమపానం,పొగాకు ఉత్పత్తులు వాడకం ద్వారా వచ్చే క్యాన్సర్ రోగాలను గురించి అవగాహన కల్పించడం మరియు విక్రయ కేంద్రాల పై తనిఖీలు చేయడం, పబ్లిక్ ప్రాంగణములో ధూమపానం చేసే వ్యక్తులకు, విక్రయించే దుకాణాలు కు తగిన చర్యలు తీసుకోవాలని వాటికి సంబంధించిన చట్టాలను ప్రజలకు, దుకాణ దారులకు తెలియ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్. హెచ్. ఎమ్. లీగల్ సెల్ ఆఫీసర్ పుట్టి శివ శంకర్ , హైకోర్టు న్యాయవాది ప్రదీప్, జిల్లా కార్యక్రమాలు మరియు పర్యవేక్షణ అధికారి డా. సి హెచ్. ధనలక్ష్మి గారు, రెండవ పట్టణ పోలీసు అధికారి సి.హెచ్. రమేష్ , జిల్లా కార్యక్రమాలు అధికారి పి.సురేష్ , బాలా, రమేష్, సాధు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది, విద్యా శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మిడియా మిత్రులు పాల్గొనడం జరిగింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *