సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో రాష్ట్రములో జరిగిన మునిసిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ ప్రభంజనంలో తెలుగు దేశం పార్టీ అతి కష్టం మీద స్వల్ప మెజారిటీ తో గెలుచుకున్న ఏకైక మునిసిపల్ చైర్మెన్ గా తాడిపత్రి లోని జేసీ ప్రభాకర్ ఇప్పటి తరానికి కూడా సుపరిచితమే.. ఈ సీటు కూడా వైసీపీ వాళ్ళు మార్చగలరు.. కానీ జగన్ ఈ విషయంలో విలువలు పాటించాడు..జంటిల్ మెన్’ అంటూ అప్పట్లో జేసీ ప్రభాకర్ అపట్లో కితాబు కూడా ఇచ్చారు. అయితే నేడు, సోమవారం కీలక పరిణామం జరిగింది. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న విజయలక్ష్మి నివాసానికి వెళ్లిన ప్రభాకర్.. సుమారు అరగంటకు పైగా పలు విషయాలపై చర్చించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తాజా పరిణామాలలో కాంగ్రెస్ ఆద్వర్యంలోని ఇండియా కూటమిలో మిగతా పార్టీ నేతలు వైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఒకవేళ జగన్ ఇండియా కూటమితో వెళ్ళితే ఏపీలో కాంగ్రెస్ అడ్జక్షురాలిగా షర్మిల పరిస్థితి ఇబ్బంది కరంగా మారుతుంది, షర్మిల కూడా ఇటీవల కూడా టీడీపీ అధినేత, CM చంద్రబాబు కు మద్దతుగానే జగన్ ను ఇరుకున పెట్టేవిధంగా మాట్లాడుతుంది. ఈనేపథ్యంలో జేసీ వై ఎస్ విజయమ్మ ఇంటికి రావడము వెనుక ఎదోకసరత్తు ఉందనే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. షర్మిల త్వరలో టీడీపీ లో చేరబోతోంది? అన్న వార్తలు లో నిజం ఎంతో త్వరలో తేలుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *