సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వచ్చాక అందరు ఆశగా ఎదురు చుసిన సూపర్ సిక్స్ పధకాలు వాయిదాలు వేస్తున్నప్పటికీ.. అధికారంలోకి వచ్చి 2 నెలలు మాత్రమే అయ్యింది కాబ్బటి ప్రజలు సర్దుకొంటున్నారు. అయితే గత ఎన్నికల ఫలితాలు తరువాత ఒక్కసారిగా నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయలు పెరిగిపోయాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు, పంచదార ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో సామాన్య ప్రజలకు వెసులు బాటుగా ఆగస్టు నుంచి రేషన్లో ఉచిత బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి రాయితీ ధరలపై రూ.67కే కిలో కందిపప్పు, రూ.17కే అరకిలో పంచదార చొప్పున పంపిణీ చేయాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది. అయితే, సకాలంలో టెండర్లు ప్రక్రియను పూర్తి కాకపోవడంతో ఆగస్టు కోటాలో కందిపప్పు సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు మొదటి జోన్ లోని శ్రీ కాకుళం, విజయనగరం, ఏఎ్సఆర్ మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి .. ఆ 5 జిల్లాలకు వచ్చే నెల కోటాలో కందిపప్పుతోపాటు పంచదార సరఫరా నిలిచిపోనుంది. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ అధికారులు సకాలంలో టెండర్లను ఖరారు చెయ్యవలసి ఉంది.
