సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు హడా వుడిగా జరిపిన బదిలీల్లో ఒక్కో ఉపాధ్యాయుడి నుంచి ఓ మంత్రి పేషీలో లక్షల రూపాయలు వసూళ్లు చేసారని బాగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎన్నికల ముందు వరుకు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లలో మొత్తం 30 మందికి గత ప్రభుత్వం వ్యక్తిగతంగా జారీచేసిన బదిలీ ఉత్తర్వులన్నింటినీ రద్దు చేస్తూ ఆదేశాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో ఆదేశాలు పంపారు. వాస్తవానికి ఈ బదిలీ ఉత్తర్వులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జారీ అయినా, సంబంధిత టీచర్లు నూతన బదిలీ స్థానాల్లో విధుల్లో చేరడానికి మే ఒకటో తేదీగా నిర్ణయించడం, ఈలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వారి బదిలీలు నిలచిపోయాయి. అయితే ప్రభుత్వ తాజా బదిలీ ఉత్తర్వుల రద్దు నిర్ణయాన్ని కొందరు కోర్టులో సవాల్ చెయ్యాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *