సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరు ఊహించినట్లుగానే.. వైసీపీ నేత, గన్నవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నేడు, శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గతంలో వంశీ ప్రమేయంతో గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిందని పిర్యదుపై ఆయనను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వాహనాన్ని అనుసరించి అదుపులోకి తీసుకున్నారు. వంశీ ఇంటికి సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడికి ప్రోద్బలం ఇచ్చింది వల్లభనేని వంశీయేనని వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు అంటున్నారు. దానితో వంశీని ఈ కేసులో ఏ1గా మార్చాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *