సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఇటీవల ప్రారంభించిన అన్న క్యాంటీన్లో ప్లేట్ల శుభ్రత కు సంబంధించి సిబ్బంది నిర్లక్ష్యం అంటూ వీడియో వైరల్ కావడంతో ఆ అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ నేడు, మంగళవారం మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ మాట్లాడుతూ.. అక్కడ నిజానికి ప్రజలు చేతులు కడిగే సింక్లో తినే అన్నం ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని, వాళ్లే అక్కడ పేట్లు పడేసి వీడియో తీసారని, విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నారంటూ లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
