సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి పలు మున్సిపాలిటీ కార్పొరేషన్ లలో ఇప్పటికే చైర్మెన్ లు మేయర్ లు గుడ్ బాయ్ చెప్పి అధికార టీడీపీ కండువాలు కప్పుకోవడంతో .. గతంలో కేవలం తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే గెలిచిన టీడీపీ ఖాతాలో ఇప్పుడు కష్టపడకుండానే ఫలితాలు అందుతున్నాయి. తాజగా నేడు, బుధవారం 2 షాక్ లు తగిలాయి. మరిన్ని భారీ షాక్ లకు అంకురార్పణ కు రంగం సిద్ధం అయినట్లు సమాచారం. జగన్ తో కలసి అదే కేసులో నిందితుడుగా చర్లపల్లి జైలు లో గడిపిన నేపథ్యంలో జగన్ అధికారంలోకి రాగానే రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చినప్పుడు ఆ ఋణం తీర్చుకొనేది కాదని.. ఈ పదవి కలలో కూడా ఊహించలేదని ప్రకటించిన మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు గురువారం వైసీపీ నాయకత్వానికి రాజీనామా లేఖ పంపనున్నరు. త్వరలో ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ ఘటన ఇలా ఉండగా.. మరో కీలక పరిణామం వైసీపీని బాగా కుదిపేసింది. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతా కూడా తన పదవి కి , పార్టీకి రాజీనామా చేసి తిరిగి కూటమి మద్దతుతో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యేందుకు రంగం చేసుకొన్నట్లు సమాచారం. మరో వైసీపీ రాజ్య సభ సభ్యుడు, పారిశ్రామిక వేత్త బీద మస్తాన్ రావు కూడా టీడీపీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. టీడీపీకి రాజ్య సభలో ప్రస్తుత్తం ఒక్క ఎంపీ కూడా లేకపోవడంతో ప్యూహాత్మకంగా ఆకర్ష్ పావులు కదులుతున్నాయి.
