సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్ వెర్ కంపెనీ ల కార్యాలయాలు ఆగమనంతో యువతకు ఉపాధి ఆశలు రేపుతున్న విశాఖకు సైబర్ హబ్ గా మరింత రాణించే అవకాశాలు స్వష్టం అవుతున్నాయి. ఒక ప్రక్క సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి లోగో ను A I గా రూపొందిస్తున్నామని గత రాత్రి ప్రకటించిన నేపథ్యంలో తాజగా.. రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్, ఏపీ ఐటీ అసోసియేషన్ ప్రతినిధులతో జరిపిన సమావేశంలో.. అంతర్జాతీయ స్థాయి వసతులు ఉన్న విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వర్సిటీని ఏర్పాటు చేస్తామని, దానిని ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రోబోటిక్స్, హెల్త్ కేర్, విద్యా రంగాలతో ఐటీని అనుసంధానం చేస్తామని చెప్పారు. విశాఖపట్నాన్ని 100 బిలియన్ డాలర్ల ఎకానమీ నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. టాప్ టెన్ ఐటీ కంపెనీలను రాష్ట్రానికి రప్పిస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గతంలో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసిన చంద్రబాబును ఇకపై 4.0 వెర్షన్లో చూడబోతున్నామన్నారు.
