సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు ఏపీలో వైసీపీ నేతలు, తెలంగాణాలో కాంగ్రెస్, వైసీపీ నేతలు ఆయన విగ్రహాల వద్ద ఘన నివాళ్లు అర్పిస్తున్నారు. ఈనేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇడుపులా పాయ వద్ద తండి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద తల్లి విజయమ్మ, భార్య భారతి తో కలసి తండ్రి ఆత్మ శాంతి కి ప్రార్ధనలు చేసారు. శ్రద్ధాంజలి ఘటించారు . అనంతరం జగన్ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జగన్ నేడు, సోమవారం ఉదయం సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురయ్యారు. ఎక్స్‌లోని పోస్ట్‌లో ‘వి మిస్ యూ డాడీ’ అని రాసి.. వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళి అర్పిస్తున్న ఫొటోలను జత చేశారు. ( ఆ ఫోటోలు పైన చూడవచ్చు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *