సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం లో పలు ప్రాంతాలలో జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అడ్జక్షులు కొటికలపూడి చినబాబు ఇతర జనసేన నేతలు పవన్ అభిమానులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు కేక్ కట్ చేసి మాట్లాడుతూ సెప్టెంబర్ 2 అంటే వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని, అభిమానులకు పండుగ రోజు అని, పవన్ అంటే ఆయనను నమ్ముకున్న అభిమానులకు గుండె ధైర్యమని అన్నారు. త్వరలో భీమవరంలోని ప్రభుత్వాసుపత్రి లోని మూడో అంతస్తులో కిడ్నీ రోగుల కోసం నూతన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభిస్తున్నామని, నెలరోజుల్లోనే పూర్తి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు .తదుపరి పట్టణంలో పర్యటన లో భాగంగా.. భీమాల శ్రీరామమూర్తి సౌజన్యంతో 27 వార్డుకు చెందిన కొక్కిరి నాగమణి అనే దివ్యాంగురాలికి ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ట్రై సైకిల్ అందించారు. రాయలంలో పత్తి హరిబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మొక్కలను నాటి మెగా మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని, గన్ని బ్యాగ్ లను, అందించారు. మొక్కలను నాటారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ముగ్గురు పేద విద్యార్థులకు దాతల సహకారంతో రూ 30 వేలు అందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *