సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ మహిళా కార్యకర్తతో కామంతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి రావడంతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగు దేశం అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. . ఈ మేరకు నేటి గురువారం మధ్యాహ్నం టీడీపీ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. ‘ఈ రోజు వివిధ మాద్యమాలలో కోనేటి ఆదిమూలం (సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే) ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది’ అని టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయ్యింది. కాగా.. సస్పెన్షన్ తరువాత వివరణ తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది.
