సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం భారతీయులందరికీ ఆధార్ కార్డు లేకుండా ఏ కీలక పనులు జరగవు అన్నది అందరికి తెలిసిందే.. ప్రస్తుతం 10 సంవత్సరాల పాత ఆధార్ కార్డులను UIDAI పూర్తిగా ఉచితంగా అప్‌డేట్ చేసేకునే సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేయడానికి రేపే (సెప్టెంబర్ 14) చివరి తేదీగా ఉంది. ఈ క్రమంలో మీరు ఈ తేదీలోగా పేరు, చిరునామా, మొబైల్ నంబర్, వయస్సుకు సంబంధించి ఆధార్ కార్డ్‌లో మార్పులు చేయాలనుకుంటే ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.UIDAI తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఎల్లుండి ఆదివారం నుండి నుండి ఆధార్ కార్డులో మీరు ఎలాంటి అప్‌డేట్‌కైనా రూ.50 రుసుము చెల్లించాలి. గతంలో దీని గడువు చాలాసార్లు పొడిగించబడింది.
