సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక కష్టాలు తీరలేదు. గత గురువారం నుంచి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇసుక కష్టాలు తీరడానికి రవాణా చార్జీలు తగ్గించడానికి నూతన ఇసుక పాలసీ ప్రకటించిన నేపథ్యంలో భవన నిర్మాణ దారులు ఇతర వినయోగదారులు తమ సమీపంలోని సచివాలయాలలో ఆన్‌లైన్ బుకింగ్ కోసం ప్రయత్నించారు. కానీ ఫలితం దక్కలేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అంతటా ఇదే పరిస్ధితి కనపడింది. . మరికొన్ని సచివాలయాలలో ఇంకా ఉచిత ఇసుకకు ఆన్‌లైన్ బుకింగ్‌కి అనుమతులు రాలేదని సంబంధిత సైట్‌లో కనిపించినట్లు తెలుస్తుంది. అసలే వరదల నేపథ్యంలో గోదావరి నది పరిసర ప్రాంతాలలో ఇసుక బయటకు తియ్యలేదు. దీనితో గత 2వారలు గా ప్రెవేటు మార్కెట్ లో ఇసుక ధరలు భారీగా పెరిగాయి 5యూనిట్లు ధర రూ.25వేలు ధర పలికింది… ఇప్పుడిపుడే మరల ఇసుక తోడివేత పనులు ప్రారంబిద్దామనుకొంటే మరల కొత్త కష్టాలు .. జిల్లాలో అవినీతి కి తావు లేకుండా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే కానీ సామాన్యునికి, తాపీ మేస్త్రులకు కార్మికులకు ఇసుక కష్టాలు తీరవు
