సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో తప్పు జరిగితే శ్రీనివాసుడు క్షమిస్తాడా? తన భక్తులను సర్వ వేళల కాచుకొనే కోనేటి రాయుడు తన కళ్ళ ముందు తన ప్రసాదం కలుషితం చేస్తే అది భక్తులకు చేరనిస్తాడా? అయితే, సీఎం చంద్రబాబు స్థాయి వ్యక్తి పవిత్ర తిరుమల లడ్డు ఫై చేసిన వ్యాఖ్యలు(గత వైసీపీ వారి హయాంలో జంతువుల కొవ్వు కలిపారని చేసిన.. ) ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో .. నేడు, శుక్రవారం మద్దిరాలపాడులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మరోమారు తిరుమల లడ్డు ఫై వివాదాస్వాద వ్యాఖ్యలు చేసారు. ఆయన మాటలలో .. మేము, మా మిత్రుడు పవన్ కళ్యాణ్, మోదీ పరిపాలనలో ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఈ 100 రోజులు పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చాను. ..గతంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయని తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోనని అన్నారు. నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ, జగన్ లాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు.ఇక చూడబోను. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా జగన్ కల్తీ చేశాడు. కల్తీ నెయ్యితో దేవుడికి నైవేథ్యం పెట్టారు. శ్రీవారి ప్రసాదంలో ఇష్టానుసారం పదార్థాలు వాడారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో.. తిరుమలలో దర్శనాలు, భోజనాలు సరిగా లేవు. క్షమించరాని నేరం చేశారు. వదిలిపెట్టేది లేదు. ఇక తిరుమలలో సంపూర్ణ ప్రక్షాళన మొదలుపెట్టాం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే జగన్ తాను ఏ తప్పు చెయ్యలేదని బుకాయిస్తున్నాడు.. బహిరంగంగానే ఆవు నెయ్యి వ్యాపారులను .టీటీడీ ద్వారా టెండర్ పిలిచానని జగన్ చెబుతున్నాడు. మరి రూ.320 కే కిలో నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం ఆలోచించవద్దా?’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
