సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూసీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై మాజీ సీఎం వైఎస్ జగన్ నేటి శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తిరుమల లడ్డు కల్తీ ఒక కట్టుకథ అని.. చంద్రబాబు 100 రోజుల పాలన ఎంత అద్వానంగా ఉందొ అందరు చుస్తునారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా ఎగ్గొట్టారో చుస్తునారు. ఒక ప్రక్క నా హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలజీలను ఎలా ప్రెవేటు పరం చేస్తున్నారో? అలాగే నా హయాంలో అడ్డుకొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా ప్రెవేటు పరం చేస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారో? వరదబాధితులను ఎలా గాలికి వదిలేసారో? ధరలు ఎలా పెరిగిపోయాయో ఈ 100 రోజుల పాలనలో చూస్తున్నాం.. మరి చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రపంచ ప్రసిద్ద తిరుమల శ్రీవారి లడ్డు లో జంతువుల కొవ్వు కల్పారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ విమర్శించారు. ఒక సీఎం ఇలా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ.. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. సంప్రదాయ పద్దతులలో దశాబ్దాలుగా లడ్డూ తయారీ విధానంలో ఒకే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నెయ్యి తెచ్చే ప్రతి ట్యాంకర్ NABL సర్టిఫికెట్ తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు. ప్రతి ట్యాంకు శాంపిళ్లను మూడుసార్లు టెస్ట్ చేస్తారని.. క్వాలిటీ లో తేడాలు వస్తే తన ప్రభుత్వం హయాంలో 18 సారులు ఆ నెయ్యి వాహనాలను తిరిగి పంపిన విషయం మీడియాకు గుర్తు చేసారు. దేవుడి ఫై విశ్వాసం లేని చంద్రబాబు ఆ భగవంతుడిని కూడా రాజకీయాలకు వాడేసుకొంటాడని, ఇంతటి నీచమైన పనిని ఎవరైనా చేస్తారా? అని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి ఇలా పచ్చి అబద్ధాలు చెప్పడం ఏంటన్నారు. .నిజానికి లడ్డు ప్రసాదం జులై 12న శాంపిల్స్ తీసుకున్నారని.. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కదా? అని జగన్ ప్రశ్నించారు. జులై 17న NDDBకి నెయ్యి శాంపిల్స్ పంపించారని.. NDDB ఆ రిపోర్ట్‌ను జులై 23న అందజేసిందన్నారు. మరి జులై 23న రిపోర్ట్ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం ఏంటని జగన్ ప్రశ్నించారు.
