సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనంతపురం జిల్లాలో నేటి ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది. బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలోని నరసమ్మ గుడి వద్ద కారును ఓ లారీ ఢీకొట్టింది. ఇన్నోవా కారు ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అనంతపురంకు చెందిన నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నార్పలలోని ఓ బర్త్ డే ఫంక్షన్ కి వెళ్ళి, వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుక్కరాయ సముద్రం రేకులకుంట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను అనంతపురం సిండికేట్ నగర్ వాసులుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *