సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి లో అంబెడ్కర్ బ్యానేర్ తొలగించారని కొన్ని వర్గాల ప్రజలు సంఘాలు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో .. దానిపై ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు వివరణ ఇస్తూ.. ఈనెల 20వ తేదీన తాను కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలకు వచ్చినప్పుడు గ్రామస్తులు నాగేంద్రుని గుడికి అడ్డంగా బ్యానర్ కట్టిన విషయాన్ని మరియు ఆ బ్యానర్ ని తొలగించమని ఎన్నిసార్లు తెలియచేసిన తొలగించగపోగా SC ST కేసులు పెడతామని బెదిరించినట్లు స్థానికులు తనకు తెలియజెయ్యాక.. వెంటనే గ్రామస్థులతో కలిసి బ్యానర్ కట్టిన ప్రదేశం వద్దకు వెళ్లి పరిశీలించి వర్గీకరణకు వ్యతిరేకంగా కట్టిన బ్యానర్ కర్రను తొలగించడమైనది. అయితే అక్కడే SC ST వర్గీకరణకు వ్యతిరేకంగా కట్టిన బ్యానర్ ప్రక్కనే 10×25 అడుగుల భారీ అంబెడ్కర్ గారి ఫ్లెక్సీ కూడా ఉన్నది. దానిని మేము ఎవరూ ఏమీ చేయలేదు .కావున ఎవరు అపోహలకు పోవద్దని అయితే కొందరు కావాలని సోదరభావంతో మెలుగుతున్న మన మధ్య వర్గ విభేదాలు సృష్టించడానికి వివాదాలు రాజేస్తున్నారు ప్రజలు గమనించాలి అని ఎమ్మెల్యే రఘురామా విజ్ఞప్తి చేసారు.
