సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో.. హిందూ ధర్మం ఫై ఎవరు అనాలోచితంగా మాట్లాడిన సహించనని తమిళ హీరో కార్తీ కి ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించిన నేపథ్యంలో హీరో కార్తీ ‘తాను ఏ తప్పు చెయ్యలేదని అయిన పవన్ కోరిక మేరకు క్షమాపణ ‘చెపుతునాన్ని చేసిన వ్యాక్యలపై తమిళనాడు సినీ ఇండస్ట్రీ లోలోన భగ్గున మండుతున్న నేపథ్యంలో.. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ పవన్ కళ్యాణ్ నుద్దేశించి వరుసగా చేస్తున్న వ్యాఖ్యానాలు సంచలనం రేపుతున్నాయి. అసలు మేము ఏమి అన్నాము . మీరేమి అర్ధం చేసుకొన్నారు ? అని ఒకరోజు.. మరో రోజు..కార్తికి పవన్‌కు క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్‌ ఆస్కింగ్‌…’ అని పేర్కొన్నారు. తాజాగా నేడు,గురువారం ఆయన చేసిన మరో ట్వీట్‌ చర్చనీయాంశమైంది.“గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం?’’ అని ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు. ప్రసిద్ద నటుడు నాజర్ కూడా కార్తీ ని క్షమాపణ చెప్పించిన తీరు లో పవన్ కళ్యాణ్ పద్దతి బాగోలేదన్నారు. మరో ప్రక్క వైసీపీ వాళ్ల్లు పవన్ కళ్యాణ్ తాను బాప్టిజం తీసుకొన్నాని, తాము క్రైస్తవులము అంటూ చేసిన వ్యాక్యలు, వీడియో పేర్ని నాని కౌంటర్ బాగా వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *