సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తిరుమల లడ్డు వివాదం తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులకు మనస్తాపం కలిగిస్తుంది. ఒక వైపు టీడీపీ, జనసేన మరో వైపు వైసీపీ ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రజలు మద్దతు పొందేందుకు తగ్గేది లే.. అంటూ హోరాహోరీ తలపడుతున్నాయి. జనసేన ఇప్పటికే ప్రాయశ్చితం దీక్షలు నిర్వహిస్తుంటే .. దానికి పోటీగా మాజీ సీఎం జగన్ ప్యూహాత్మకంగా మరో అడుగు ముందుకువేస్తున్నారు . “తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వేంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, స్వామివారి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను,రాజకీయ దుర్బుద్ధితో, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ‘ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు’. . చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్నిశ్రీ వెంకటేశ్వర ఆలయాల్లో ఈ సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది” అని జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ఇక మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రేపు శుక్రవారం తిరుపతి వచ్చి అలిపిరి నడక దారిలో తిరుమల చేరుకుని 28న శ్రీవారిని దర్శించుకుంటారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. దీనితో ఈ లడ్డు వివాదం ఇప్పటిలో చల్లారేలా లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *