సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ ,శ్రీ విష్ణు హీరోగా శ్వా గ్ సినిమా నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజరాజచోర లాం టి మం చి సినిమా తర్వాత హీరో శ్రీవిష్ణు,,దర్శకుడు హసిత్ గోలి, నిర్మా త టీజీ విశ్వప్రసాద్ కలిసి చేసిన సినిమా శ్వాగ్. మరి వీళ్ల రెండో ప్రయత్నం ఎలా ఉందొ కానీ.. కధ మాత్రం రివ్యూ రాయాలన్న గందరగోళ పరుస్తుంది. అందుకే దాని జోలికి వెళ్లకుండా సినిమా విషయానికి వస్తే ..“స్త్రీ-పురుష సమానత్వ మే అసలైన ప్రజాస్వామం .” శ్వా గ్సినిమా చివర్లో దర్శకుడు వేసిన కార్డు ఇది. అయితే ఈ విభిన్న కధ లో ప్రేక్షకులు లీనం కావడానికి ప్రథమార్ధం మొత్తం సరిపోతుంది. ఇంటర్వెల్ తరువాత మాత్రం నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. ” శ్రీ విష్ణు ఏకంగా 4 పాత్రలలో నటించాడు. కధ ప్రకారం అన్ని గెటప్ లలో శ్రీ విష్ణు యే నటించవలసిన అవసరం ఉంది. సెకం డాఫ్ లో ట్రాన్స్ జెండర్ గా శ్రీవిష్ణు విభూతి పాత్ర వచ్చి న తర్వాత కామెడీ తగ్గింది. అయితే సినిమా మొత్తానికి భవభూతి పాత్ర హైలెట్. ఇది 2 షేడ్స్ లోసాగుతుంది. ఒకటి పోలీస్ పాత్రలో భర్తగా, మరొకటి రిటైర్మెంట్ కు దగ్గరైన వయసుమళ్లిన షేడ్.. ఈ రెండు షేడ్స్లో శ్రీవిష్ణు నటనలో అదరగొట్టాడు. సూపర్ హిట్ సినిమా పాటల్నిఅతడు మాటల్లా చెబుతుంటే నవ్వొస్తుంది. రెండేసి పాత్రల్లోరీతూ వర్మ, మీరా జాస్మి న్, దక్ష నగార్కర్ చక్కగా నటించారు. మొత్తానికి కాస్త ద్వందార్ధాలు ప్రక్కన పెడితే యువతను టార్గెట్గా సినిమాను తీసారని భావించవచ్చు.. సెకండ్ అఫ్ సినిమా బాగుంది. మొత్తానికి స్వాగ్ మంచి పన్ని సినిమా విష్ణు కు విజయం అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *