సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్థానిక శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ భీమవరం మరియు డాక్టర్ బి.వి.రాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో మరియు విష్ణు స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న WORLD SPACE WEEK కార్యక్రమానికి నేడు,ఆ ఆదివారం ముఖ్య అదితి గా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి ఐఏఎస్ మరియు సతీష్ థావన్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ టి.ఎస్ రఘురాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ టిఎన్ రఘురాం మాట్లాడుతూ అంతరిక్షానికి సంబంధించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు విద్యార్థులకు తెలియజేశారు. రాబోవు తరాలకు వైజ్ఞానిక ఆశక్తిని పెంపొందించడానికి ఇస్రో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేపడుతుందని తెలియజేశారు.అనంతరం ఇస్రో ఏర్పాటు చేసిన నమూనాలను ప్రదర్శన నిమిత్తం విష్ణు కళాశాల ప్రాంగణంలో ఉందారు రేపు సోమవారం సాయంత్రం వరకు ఈ నమూనాలు ప్రదర్శనకు ఉంచబడతాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విష్ణు స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్ బిందు, కళాశాల జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, ప్రసాద్ రాజు , స్టూడెంట్ అఫైర్స్ అండ్ ఎడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ P. శ్రీనివాస రాజు , బీవీ రాజు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ ఆర్ కృష్ణంరాజు గారు, AGM రమేష్ రాజు , పలు విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, , అధ్యాపకులు కళాశాల విద్యార్థిని విద్యార్ధులు మరియు అద్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *