సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని నరేంద్ర మోదీ తో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేటి సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అందజేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా దేశ రాజధానిలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ మేరకు ఇవాళ(సోమవారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకుని ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం మెుదట విడత నిధులు, రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా అందించే రూ.15కోట్లపైనా ఇరువురు చర్చించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అంశాలనూ చర్చించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
