సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:దసరా పర్వదినాలు చివరి అంకానికి చేరుకొన్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు విద్య సంస్థలు సెలవులు ప్రకటించడంతో పాటు రేపు ఎల్లుండి శని, ఆదివారం కూడా కావడంతో భీమవరం బస్సు స్టాండ్ నేడు, శుక్రవారం ఉదయం నుండి భారీగా ప్రయాణికుల రద్దీతో నిండిపోయింది. గత 2 రోజులుగా భీమవరం ఆర్టీసీ బస్సు స్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సు స్టాండ్లలో ఇదే పరిస్థితి. అయితేనిన్న , గురువారం, నేడు, శుక్రవారం మరింత రద్దీ పెరిగింది. పాలకొల్లు, ఏలూరు, విజయవాడ, అమలాపురం, వంటి ప్రాంతాలకు బస్సు రావడం ఆలస్యం ప్రయాణికులు తమకు సీటు దొరకదేమో అన్న భయంతో బస్సులను చుట్టుముట్టేసున్నారు.( ఫై చిత్రంలో చూడవచ్చు). దీనితో దసరా పండుగ సీజన్ ఆర్టీసీకి బాగానే కలసి వచ్చింది. పండుగ కు ముందు ఆదాయం బాగుంది. అలాగే పండుగ ముగిసిన తర్వాత కూడా తిరుగు ప్రయాణాలతో సోమవారం నుండి ఆదాయం మరింత ఆదాయం ఆర్టీసీ సాధించే అవకాశం ఉంది. దసరా పండుగ సందర్భంగా నేటి శుక్రవారం నుండి ఆర్టీసీ హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. భీమవరంతో పాటు జిల్లాలోని ప్రధాన టౌన్ లకు కలపి 14 బస్సు సర్వీసులు అదనంగా నడుస్తాయి. ఈనెల 13, 14 తేదీలలలో ప్రయాణికుల రద్దీ బట్టి మరిన్ని అదనపు సర్వీసులు ఏర్పాటు కు జిల్లా ఆర్టీసీ సిద్ధంగా ఉంది. దానికనుగుణంగా ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
