సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో దేవి శరన్నవరాత్రులలో భాగంగా నేడు, శుక్రవారం మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో శ్రీ అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో ఈలంపూడి కి చెందిన M శ్రీనివాస్ రాజు అన్నపూర్ణాన్నమ్మ దంపతులు శ్రీ మావుళ్ళమ్మ వారికీ వివిధ రకాల పండ్లు, స్వీట్స్ ,పూల దండలతో చీర రవికలతో శ్రీ అమ్మవారికి సారె గా సమర్పించారు.వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. నేడు శ్రీ అమ్మవారిని దర్శించుకున్న మార్టేరు కి చెందిన కే శ్రీనివాస రెడ్డి శ్రీ దేవి దంపతులు 248 గ్రాముల వెండిని కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీమద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించినారు. వారికీ ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదం,శ్రీ అమ్మవారి శేషవస్త్రం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *