సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: – బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో అది తుపానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులను జిల్లా కలెక్టర్ సి నాగరాణి అలర్ట్ చేసారు. అక్టోబర్ 14,15 తేదీల్లో తేలికపాటి వర్షాలు, 16వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో, జిల్లా అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని,అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జిల్లా అధికారులు సమన్వయంగా పనిచెయ్యాలని జిల్లాలో వర్షాల ప్రభావానికి గురయ్యే ప్రాంతాలను గుర్తించి, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పట్టణాలు, పల్లెల్లోని కాలువలు, డ్రైనేజీ మార్గాలను వెంటనే శుభ్రం చేయించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరి పంట కీలక దశలో ఉండటంతో పొలాలలో ఆ పంట సంరక్షణ:కోసం వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వర్షాల నుండి పంట నష్టాన్ని తగ్గించుకునేందుకు అవగాహన కల్పించాలన్నారు ,ప్రజలు జిల్లా అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
………………………………………………
